Friday, November 22, 2024
HomeTrending NewsJohannesburg: 73కు చేరిన దక్షిణాఫ్రికా మృతులు

Johannesburg: 73కు చేరిన దక్షిణాఫ్రికా మృతులు

సౌతాఫ్రికాలోని జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో గురువారం తెల్ల‌వారుజామున ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అగ్నికీల‌ల‌కు 73 మంది బ‌ల‌య్యారు. మ‌రో 52 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాలిన గాయాల‌తో పాటు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారిని స‌మీప ఆస్ప‌త్రుల్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

సెంట్రల్ జొహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లోఉన్న ఓ ఐదు అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ మంటల్లో ఇప్పటి వరకూ 73 మంది సజీవ దహనమయ్యారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ తెలిపింది.

భవనంలో సుమారు 200 మంది నివాసం ఉంటున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు పేర్కొంది. మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్