Wednesday, March 12, 2025
HomeTrending NewsKarnataka: పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ - రాహుల్‌గాంధీ

Karnataka: పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ – రాహుల్‌గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపట్ల ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అపూర్వ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు.. జాతీయ, రాష్ట్ర నాయకులకు.. కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ ఓటమితో కర్ణాటకలో విద్వేష పాలన ముగిసిందని, కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రేమపూర్వక పాలన మొదలైందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే తమ ప్రభుత్వం కర్ణాటకలో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. పలు హామీలపై మొదటి క్యాబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎళ్లవేలలా పేదల కోసం పోరాటం చేసిందని, ఎప్పటికీ పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని చెప్పారు. కర్ణాటకలోని పేద ప్రజలు.. ధనికులతో సహవాసం చేసే బీజేపీ సర్కారును ఓడించారని పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్