Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

కేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

Farmers : దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం అడ్డంకులు సృష్టించకుంటే ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాలలో, భవిష్యత్ లో 90 లక్షల ఎకరాలకు వరి సాగు వెళ్లేదన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మీడియా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

దేశంలో ఒక రాష్ట్రం పురోగమిస్తుంటే సహకారం అందించాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు తేవడం, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించడం మా తప్పా ? దురదృష్టవశాత్తు కొనుగోళ్లు, గోదాంలు కేంద్రం చేతిలో ఉన్నందున కేంద్రాన్ని అడగాల్సి వస్తుందని, కేంద్రానికి చేతకాకుంటే హక్కులు రాష్ట్రాలకు బదలాయించాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రేమలేఖలు ఇవ్వడానికో .. ప్రేమించడానికో ఢిల్లీకి రాలేదని, రైతుల సమస్యల గురించి మాట్లాడేందుకు వస్తే తమాషాగా కనిపిస్తుంది ? కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్పోరేట్ పెద్దల కోసం ఎంత దూరమైనా వెళ్తారు .. దగ్గరుండి ప్రభుత్వ పెద్దలు ఒప్పందాలు చేయిస్తారని, లక్షల మంది జీవితాలతో ముడిపడిన రైతుల సమస్యల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని ప్రశ్నించారు.

రైతుల పట్ల కేంద్రానికి ఎలాంటి పట్టింపు లేదని, వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి మాటిచ్చారు .. దాని ప్రకారమే లేఖ కోసం వేచి చూస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలలో ఉన్న తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి ఈ విషయంలో బాధ్యత లేదా ? కేవలం టీఆర్ఎస్, కేసీఆర్ ను తిట్టడానికే వీరున్నారా ? తెలంగాణ రైతుల పట్ల మీకు బాధ్యత లేదా ? స్వామినాధన్ కమిటీ సిఫార్సులు కేంద్రం ఎందుకు అమలుచేయడం లేదు?

మోడీ ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారని, ఎంఎస్పీకి చట్టబద్దత ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. నల్లచట్టాలు తెచ్చి రైతుల ఆగ్రహం చూసి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం వెనక్కు తీసుకున్నారని, దేశంలో పండే 57 రకాలకు పైగా పంటలకు గాను 14 నుండి 23 రకాలకే మద్దతుధర ప్రకటిస్తుందని వెల్లడించారు. అందులో పండిన పంటలో కేవలం 25 శాతం పంటనే కొనుగోలు చేస్తున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు ఏడాదికి రూ.2.28 లక్షల కోట్లు ఇస్తే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుంది .. దేశ బడ్జెట్ లో ఇది 8 శాతం మాత్రమే అన్నారు. కార్పోరేట్లకు ఇచ్చిన మినహాయింపుతో పోల్చుకుంటే ఇది ఎంత మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read : రైతు శత్రువు పార్టీ బిజెపి

RELATED ARTICLES

Most Popular

న్యూస్