Friday, September 20, 2024
HomeTrending NewsMedak: మెదక్ జిల్లాలో సిఎం కెసిఆర్...అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Medak: మెదక్ జిల్లాలో సిఎం కెసిఆర్…అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

నూతనంగా నిర్మించిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కి స్వాగతం పలికిన మంత్రులు, బిఆర్ఎస్ నాయకులు.

బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అధినేత. శిలాఫలాకాన్ని ఆవిష్కరించి, బిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ని కుర్చీలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

ఆ తర్వాత మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సిఎం కెసిఆర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్