Tuesday, June 16, 2026
HomeసినిమాVennela Kishore: ‘వెన్నెల' కిశోర్ హీరోగా 'చారి 111'

Vennela Kishore: ‘వెన్నెల’ కిశోర్ హీరోగా ‘చారి 111’

వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’. బర్కత్ స్టూడియోస్ పతాకం పై అదితి సోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.

‘చారి 111’ గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ… ‘ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular