Friday, September 20, 2024
HomeTrending Newsసుప్రీంకోర్టుకు జడ్జిల పేర్లు సిఫార్సు

సుప్రీంకోర్టుకు జడ్జిల పేర్లు సిఫార్సు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బి.వి. నాగరత్న పేరును కేంద్రం ఆమోదిస్తే గనుక 2027లో ఆమె భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

కొలీజియం సిఫార్సు చేసిన వారిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి పేరు కూడా ఉంది.
ఇక జస్టిస్‌ బి.వి నాగరత్న ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఒకవేళ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే తొలి మహిళా సీజేఐగా దేశ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించినవారవుతారు. అంతేగాక, ఆమె తండ్రి ఈఎస్‌ వెంకటరామయ్య కూడా  1989 జూన్‌ నుంచి 1989 డిసెంబరు వరకు సుప్రీంకోర్టు సీజేఐగా వ్యవహరించారు.

సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. మాజీ సీజేఐ ఎస్‌ఏ బోబ్డే కూడా తన పదవీ విరమణకు ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘మహిళా సీజేఐని నియమించాల్సిన సమయం ఆసన్నమైంది’అని అన్నారు. ప్రస్తుత సీజేఐ ఎన్‌.వి. రమణ కూడా న్యాయవ్యవస్థకు మహిళా నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. అన్నట్లుగానే తాజాగా ఆయన నేతృత్వంలోని కొలీజియం ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించేందుకు సిఫార్సులు చేసింది.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఇవే..

జస్టిస్‌ హిమా కోహ్లి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్‌ బి.వి. నాగరత్న : కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ బేలా త్రివేది : గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ జేకే మహేశ్వరి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్‌ సి.టి. రవికుమార్‌ : కేరళ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌ : కేరళ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా : కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ : గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సీనియర్‌ న్యాయవాది: పీఎన్‌ నరసింహ

RELATED ARTICLES

Most Popular

న్యూస్