Sunday, January 19, 2025
HomeTrending Newsఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు: రేవంత్

ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు: రేవంత్

భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పరిపూర్ణ విశ్వాసం ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల విజ్ఞత, చిత్తశుద్దిని ప్రశించే విధంగా తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా నిన్నటి (ఆగస్ట్ 29)  దినపత్రికల్లో వచ్చిన వార్తలు తాను చేసినవి కాదని.. తనకు ఆపాదించారని పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితకు మూడ్రోజుల క్రితం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసింది. బిజెపి-బిఆర్ఎస్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే ఈ బెయిల్ వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చెప్పినట్లు నిన్న పలు ప్రధాన దినపత్రికల్లో వార్తలు వచ్చాయి.  నిన్న సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలను పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా రేవంత్ దానిపై ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.

న్యాయ ప్రక్రియను బలంగా విశ్వసించే వ్యక్తుల్లో తానూ ఒకడినని రేవంత్ పునరుద్ఘాటించారు.  పత్రికల్లో తన పేరిట వచ్చిన వార్తలపట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను చెప్పిన అంశాలకు భిన్నంగా, వాటిని తమకు అనుకూలంగా పత్రికల్లో ప్రతిబింబించారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, భారత రాజ్యాంగం దాని నైతికతపై దృఢ విశ్వాసం కలిగి ఉన్నానని అన్నారు. భవిష్యతుల్లో  న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని, విధేయతను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్