ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి విస్తరణ జరుగుతూనే ఉంది. అన్ని ఖండాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. డెల్ట వేరియంట్ ప్రభావంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
బ్రెజిల్ దేశంలో కరోన కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి మహమ్మారి వ్యాప్తి జరుగుతూనే ఉంది. తాజాగా బ్రెజిల్ లో 34 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. వెయ్యి మంది చనిపోయారు. కోవిడ్ మరణాల్లో అమెరికా తర్వాత అత్యధికంగా బ్రెజిల్ దేశంలోనే మృత్యువాత పడుతున్నారు. దక్షిణ అమెరికా ఖండంలో కీలక దేశమైన బ్రెజిల్ లో కరోన మహమ్మారి విస్తరణ ఇతర దేశాలపై ప్రభావం చూపుతోంది. రోజువారి కేసులు కూడా అమెరికా, భారత్ తర్వాత బ్రెజిల్ దేశం మూడో స్థానంలో ఉంది.
అటు రష్యాలో రోజుకు 25 వేల కేసులు నమోదవుతుండగా రోజుకు 800 మంది చనిపోతున్నారు. రష్యాలో గ్రామీణ ప్రాంతాలు కొంత సురక్షితంగా ఉండగా నగరాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఆగటం లేదు. రాజధాని మాస్కో లో రోజుకు మూడు వేల కేసులు వస్తున్నాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లో రోజుకు రెండు వేల కేసులు నమోదవుతున్నాయి.
విస్తీర్ణ పరంగా చిన్న దేశమైన మొరాకో లో కూడా కరోన కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి.మొరాకో లో ప్రతి రోజు పది వేల కేసులకు పైనే వస్తుండగా వంద మంది చనిపోతున్నారు. ఈ ఆఫ్రికా దేశానికి టీకాలు జనవరిలో అందటంతో కరోన కొంత వరకు కట్టడి అవుతోంది.