కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించింది. అన్ని రకాల ఉహాగానాలకు తెరదించుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో కొత్తగా 60 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మధ్యప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
మిజోరంతో మొదలై తెలంగాణలో చివరగా పోలింగ్ జరుగుతుంది. మిజోరం, తెలంగాణా, మధ్యప్రదేశ్లో, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. కేవలం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మాత్రమె రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3 వ తేదిన వెలువడుతాయి. ఎన్నికల నిర్వహణ డిసెంబర్ ఐదవ వ తేదీతో ముగుస్తుంది.
తెలంగాణ – 119 నియోజకవర్గాలు ఉండగా 16.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో నవంబర్ 3వ తేదిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 30వ తేదిన పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3వ తేదిన వోట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు.
నోటిఫికేషన్ – నవంబర్ – 3, నామినేషన్ల స్వీకరణ- నవంబర్ -10, నవంబర్ -14న నామినేషన్ల పరిశీలన, నవంబర్-15వ తేది లోపు నామినేషన్ల ఉపసంహరణ,
మిజోరం – 40 నియోజవర్గాలు ఉండగా 8.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 7 నవంబర్ వోటింగ్ జరుగుతుంది. 17
మధ్యప్రదేశ్ – 230 నియోజకవర్గాలకు గాను 5.06 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 17వ తేదిన పోలింగ్ నిర్వహిస్తారు.
చత్తీస్ గడ్ – 90 నియోజకవర్గాలు ఉండగా 2.03 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోని ఓటర్ల కోసం ఈ దఫా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. నవంబర్ 7 మొదటి దశ కాగా రెండో దశ నవంబర్ 17 వ తేదిన పోలింగ్ జరుగుతుంది.
రాజస్తాన్ – 200 నియోజకవర్గాలకు గాను 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 23వ తేదిన పోలింగ్ నిర్వహిస్తారు.