రంజీ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో మధ్య ప్రదేశ్ పై బెంగాల్ భారీ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లకు 59 పరుగుల వద్ద నేడు నాలుగో రోజు మొదలు పెట్టిన బెంగాల్ ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 279 పరుగులు చేసింది. అనుష్టుప్ మజుందార్- 80; ప్రదీప్త ప్రామాణిక్-60; సుదీప్ కుమార్ ఘరామి-41 పరుగులతో రాణించారు. మొత్తంగా 547 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ ఉంది.
మధ్య ప్రదేశ్ బౌలర్ సరన్ష్ జైన్ ఆరు వికెట్లతో సత్తా చాటాడు. కుమార్ కార్తికేయ మూడు వికెట్లు పడగొట్టాడు.
***
రెండో సెమీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర కంటే 120 పరుగులు వెనుకబడిన కర్నాటక నేటి ఆట ముగిసే సమయానికి నాలుగు పరుగుల ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 364 పరుగుల వద్ద నేటి ఆట మొదలు పెట్టిన సౌరాష్ట్ర 527 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న112 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ అర్పిత్ వాసవడ డబుల్ సెంచరీ (202) పూర్తి చేశాడు. చిరాగ్ జానీ 72రన్స్ చేశాడు.
కర్నాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 5; శ్రేయాస్ గోపాల్ 2; కౌశిక్, గౌతమ్ చెరో వికెట్ పడగొట్టారు.
నేడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కర్నాటక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 55 రన్స్ చేసి అవుట్ కాగా…నికిన్ జోస్ 54తో క్రీజులో ఉన్నాడు.
సౌరాష్ట్ర బౌలర్ చేతన్ సకారియా రెండు వికెట్లు పడగొట్టాడు.
నేడు చివరి రోజు ఆటలో రెండు సెమీ ఫైనల్స్ నుంచి ఏ జట్లు ఫైనల్స్ కు చేరుకుంటాయో వేచి చూడాలి