Monday, June 15, 2026
HomeసినిమాGuntur Kaaram: 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ ఎప్పుడు..?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు..?

మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్స్ బ్రేకులు పడ్డాయి. ఈసారి అలా కాకుండా ఎలాంటి బ్రేకులు లేకుండా నాన్ స్టాఫ్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన మహేష్.. ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

మహేష్ మరి కొంత మంది తారాగాణం పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మహేష్ పుట్టినరోజుకు రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఫస్ట్ సింగిల్ రెడీ అయ్యింది కానీ.. మహేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆగింది. దీంతో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ను వినాయక చవితికి విడుదల చేయనున్నారని తెలిసింది. నవంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular