Sunday, January 19, 2025
HomeTrending Newsవెంకట్రామి రెడ్డి నామినేషన్ అభ్యంతరకరం

వెంకట్రామి రెడ్డి నామినేషన్ అభ్యంతరకరం

The Former Ias Nomination Is Objectionable :

ఐ.ఏ.ఎస్ మాజీ అధికారి వెంకట్రామి రెడ్డి రాజీనామా కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదిస్తే సరిపోదు, కేంద్రం పరిధిలోని DOP కూడా ఆమోదించాలని, వారు ఆమోదించినట్టు చూపే పత్రాలు దాఖలు చేసినపుడే నామినేషన్ పరిగణనలోకి తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకట్రామి రెడ్డి నిన్న సాయంత్రం తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయగా ఇప్పటివరకు ఆన్ లైన్ లో ఉంచాలని, ఎన్నికల అధికారులతో మాట్లాడితే ఎవరు స్పందించటం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐ.ఏ.ఎస్ మాజీ అధికారి వెంకట్రామి రెడ్డి ఆస్థులు, ఆయన గతంపై ఫిర్యాదులు వస్తాయనే ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. మండలి ఎన్నికల తంతు మీద రిటర్నింగ్ అధికారి ప్రవర్తన రాజ్యాంగ విరుద్దమన్నారు.

శాసనమండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై శాసనసభ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహాచార్యులుకు  కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ వెళ్ళారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐ.ఏ.ఎస్ మాజీ అధికారి వెంకట్ రాం రెడ్డీ..అత్యంత అవినీతి అధికారిగా ముద్ర పడ్డ అధికారి అని సి.ఎల్.పి నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శాఖా పరంగా cbi లో కూడా ఫిర్యాదులు ఉన్నాయని, భూముల ఆక్రమణ కేసులు ఎన్నో ఉన్నాయని భట్టి గుర్తు చేశారు. ఆగమేఘాల మీద కలెక్టర్ ఉద్యోగం కి రాజీనామా చేయటం, వెంటనే… ఆమోదం.. ఆ వెంటనే mlc అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేయటం అనుమానాలకు దారితీస్తోందన్నారు. వెంకట్ రాం రెడ్డీ..ఆణిముత్యం అన్నట్టు రాజీనామా ఇవ్వగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆమోదం తెలపటం విస్మయం కలిగిస్తోందన్నారు. కెసిఆర్ కాళ్ళు మొక్కినప్పుడే అధికార యంత్రాంగం పరువు తీశాడని, అధికారిగా..trs కె పని చేశారు అనేది ఇంతకు మించి ఏం ఆధారం కావాలన్నారు.

Also Read :  సిద్దిపేట కలెక్టర్ రాజీనామా

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్