Friday, September 20, 2024
HomeTrending NewsWagner Chief: రహస్యంగా ప్రిగోజిన్‌ అంత్యక్రియలు...పుతిన్ గైర్హాజరు

Wagner Chief: రహస్యంగా ప్రిగోజిన్‌ అంత్యక్రియలు…పుతిన్ గైర్హాజరు

రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పొర్ఖొవ్ స్కయా శ్మశానవాటికలో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఒకప్పటి తన అంతరంగికుడి అంతిమ సంస్కారాలకు అధ్యక్షుడు పుతిన్‌ హాజరుకాలేదు. ప్రిగోజిన్ అంత్యక్రియలకు హాజరయ్యే ఉద్దేశం పుతిన్ కు లేదని క్రెమ్లిన్‌ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇటీవలే జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. మాస్కో నుంచి సెయింట్‌ పీట్స్‌బర్గ్‌కు ప్రైవేటు విమానంలో వెళ్తుండగా.. మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌ సహా మొత్తం 10 మంది మరణించారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. కానీ, వాగ్నర్‌ చీఫ్‌ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రిగోజిన్‌ అంత్యక్రియలను చివరి వరకూ రహస్యంగా ఉంచడం గమనార్హం.

మరోవైపు ర‌ష్యాలోని ఈస్టోనియా బోర్డ‌ర్ వ‌ద్ద పిస్కోవ్ న‌గ‌ర విమానాశ్ర‌యంపై డ్రోన్ దాడి జ‌రిగింది. ఆ దాడిలో మిలిట‌రీకి చెందిన రెండు ర‌వాణా విమానాలు ధ్వంసం అయ్యాయి. వ‌రుస‌గా జ‌రిగిన డ్రోన్ అటాక్‌లో ఇలుషిన్ 76 ట్రాన్స్‌పోర్టు విమానాలు డ్యామేజ్ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పీస్కోవ్ న‌గ‌రం ఉక్రెయిన్‌కు సుమారు 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడితో త‌మ‌కు సంబంధం లేద‌ని ఉక్రెయిన్ తెలిపింది. ఎయిర్‌పోర్టుపై జ‌రిగిన డ్రోన్ అటాక్‌ను తిప్పికొట్టిన‌ట్లు ర‌ష్యా తెలిపింది. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు ర‌ష్యా అధికారులు చెప్పారు. దాదాపు 15 డ్రోన్ల‌తో ఎయిర్‌పోర్టుపై దాడి జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్