Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ది ఘోస్ట్‘. నాగార్జున స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టించింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

“ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటల్జెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్. నిర్మాతలు సునీల్, శరత్ మరార్ లని ముందు కలవడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ చర్చ నడుస్తునపుడు.. వేరేది చేద్దామని నాగ్ సర్ అన్నారు.”

Trailer Ghost

“నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని కథ రాయడం జరిగింది. నా కెరీర్ లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటన్సిటీ, స్టయిల్, గ్రేస్ ఉపయోగించుకొని , ఆయన్ని ఎలా చూడాలనుకుంటు న్నానో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్ తో ఇంపాక్ట్ చూపే విధంగా వుంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ వుంటుంది”

“నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్ వచ్చేస్తుంది. మన బౌండరీలు మనకి తెలిసిపోయినప్పుడు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. న‌న్ను అడిగితే ముందు కథ రాసుకొని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం. కథ రాసుకున్నపుడు ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టొరీ రాస్తాం. అలాంటి బ్యాక్ స్టొరీ ఉన్నపుడే పాత్రకు బలం చేకూరుతుంది. నాగార్జున గారు ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తారు”

Release Of Ghost Movie

“అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్ లో పాల్గొనివుంటారు. అలా తన జర్నీ లో జపాన్ వెళ్లినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహగనే. ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ. 12 యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. ప్రేక్షకులకు అడ్రినల్ రష్ ఇచ్చే సినిమా. క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు. ఎంతవరకూ రాజీపడాలో తెలుసు. అయితే సొంత ప్రొడక్షన్ లో రిలీజ్ సమయంలో సమస్య వస్తుంది. సినిమాని రిలీజ్ చేయడం అంత తేలిక కాదు. మంచి ప్రోడక్ట్ ని రెడీ చేసిన తర్వాత దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం.”

“నా ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలకు రిలీజ్ దగ్గర ఇబ్బందిపడ్డా. అయితే వేరే నిర్మాణ సంస్థలో చేస్తున్నపుడు కూడా నిర్మాత సెట్ లో వుంటే బావుంటుంది. నావరకూ నిర్మాత ని ప్రతి రోజు సెట్ కి రమ్మని చెబుతాను. నిర్మాత సెట్ లో వుంటే పనులు త్వరగా జరుగుతాయి. హై ఎమోషన్స్ హీరోయిజం వున్న చిత్రమిది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. విజల్ వేసే మూమెంట్స్ కూడా వుంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. వరుణ్ తేజ్ గారితో సినిమా అక్టోబర్ 10 నుండి యూకే లో మొదలౌతుంది. ఒక వెబ్ సిరిస్ ప్లాన్ కూడా వుంది”  అంటూ విశేషాలు వెల్లడించారు.

Also Read: ది ఘోస్ట్ ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com