Monday, June 8, 2026
Homeసినిమాఆగస్టు 25న 'ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్

ఆగస్టు 25న ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున.
ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అలరించాయి.

ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా  ట్రైలర్ పైనే పడింది. ఆగస్ట్ 25న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో మరింత ఎక్సయిటింగ్ యాక్షన్‌ ని చూపించే అవకాశం ఉంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ శిధిలమైన ఓ పెద్ద భవంతిలో నిలబడి వుండటం.. చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను సూచిస్తుంది. నాగార్జున ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ పట్టుకొని డాషింగ్ అండ్ సూపర్ ఫిట్‌గా కనిపించగా, సోనాల్ చేతిలో కూడా గన్ వుండటం పోస్టర్ లో గమనించవచ్చు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

Also Read : ‘ది ఘోస్ట్’కి హాలీవుడ్ మూవీకి లింకేమిటి? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular