Thursday, March 12, 2026
Homeసినిమా'ది ఘోస్ట్' ట్రైలర్ లాంచ్ చేసిన సూపర్ స్టార్

‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ చేసిన సూపర్ స్టార్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్‘. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్‌కు బెస్ట్ విశేష్ తెలిపారు.

ట్రైలర్ ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశం పై క్యూరియాసిటీని కలిగించింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లెలు, మేనకోడలును సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా వున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది. నాగార్జున తన ఫెరోసియాస్ యాక్ట్ తో ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. నాగ్  సరసన సోనాల్ చౌహాన్, సోదరిగా గుల్ పనాగ్ , మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ నటించారు. కనిపించింది.

ట్రైలర్ లో నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా వున్నాయి. ఇప్పటి వరకూ వున్న అంచనాలని ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular