Sunday, June 7, 2026
Homeసినిమానాగ్ ది ఘోస్ట్ కోసం రంగంలోకి మ‌హేష్ బాబు.

నాగ్ ది ఘోస్ట్ కోసం రంగంలోకి మ‌హేష్ బాబు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్‘.  ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఆగష్టు 25న ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయనుంది యూనిట్.

ఈ మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నట్లుగా ‘ది ఘోస్ట్’ యూనిట్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థలపై అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇతర పాత్రల్లో గుల్ పనాగ్, రవి వర్మ, మనీష్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, సురేంద్రన్ తదితరులు నటించారు.

టీజ‌ర్ తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ మ‌హేష్ బాబు రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. అలాగే ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన ‘శివ’ కూడా ఇదే తేదీన విడుదలైంది. ‘ది ఘోస్ట్’  విడుదల రోజునే   చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’ కూడా రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

Also Read : ఆగస్టు 25న ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular