Saturday, January 18, 2025
Homeసినిమాతండ్రీ కొడుకుల మధ్య సాగే వార్ .. 'ది గోట్'  

తండ్రీ కొడుకుల మధ్య సాగే వార్ .. ‘ది గోట్’  

విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయనకి ఒక రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. రజనీ తరువాత స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వచ్చిన హీరో అతను. ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అలాంటి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కోలీవుడ్ థియేటర్స్ దగ్గర కోలాహాలం మామూలుగా ఉండదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోను ఆయన సినిమాలకి మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

అలాంటి విజయ్ నుంచి నిన్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి సరసన స్నేహా .. కొడుకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపిస్తారు. టెర్రరిస్టులను ఏరిపారేసే ఒక స్పెషల్ స్క్వాడ్ లో తండ్రి పని చేస్తూ ఉంటాడు. ఒక తీవ్రవాదికి చెందిన టీమ్ లో కొడుకు పనిచేస్తూ ఉంటాడు. ఆ విషయం తండ్రికి అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? అనేదే ప్రధానమైన కథాంశం.

నిజానికి ఇది కొత్త కథేమీ కాదు ..  ఎక్కడా కొత్త పాయింట్ కనిపించదు. తెరపై తండ్రీ కొడుకులు చేసే హడావిడికి గుండె దడ పెరుగుతుంది. సరైన కథ లేకుండా వచ్చి వాళ్లు పడుతున్న కష్టాలు చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక్కోసారి హీరోలు కొన్ని కథలను సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. కానీ తండ్రీ కొడుకుల పాత్రలకు సంబంధించిన లుక్స్ విషయంలో కూడా విజయ్ కేర్ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఇమేజ్ ను పట్టించుకోకుండా దర్శకుడు కథను మలుపులు తిప్పేయడం మరింత షాక్ ఇస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్