Sunday, September 29, 2024
HomeTrending Newsమెట్రోకు నష్టాలు ఆదుకునేందుకు సన్నాహాలు

మెట్రోకు నష్టాలు ఆదుకునేందుకు సన్నాహాలు

కరోనా పరిస్థితుల్లో  ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా  హైద్రాబాద్ మెట్రో  సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎల్ అండ్ టి సంస్థ అధికారులకు సిఎం తెలిపారు.

కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశం పై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టీ  సంస్థ సీఈవో & ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖామంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు,  డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డికె సేన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైద్రాబాద్ మెట్రో సీఈవో కెవిబీ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 కరోనా మూలంగా  మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరారు.

ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలు కు సంబంధించిన రవాణా, తదితర అంశాలు చర్చించిన సిఎం, వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సబంధించి ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందుకు సంబంధించి నివేదికను అందచేయాలని సిఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్