Monday, January 20, 2025
HomeTrending Newse-RUPI విడుదల

e-RUPI విడుదల

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ e-RUPIని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దీనిని ప్రారంభించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం e-RUPIని తీసుకువచ్చింది. e-RUPI ప్రీపెయిడ్ ఇ-వోచర్, దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసింది. దీని ద్వారా, నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత పేమెంట్‌ విధానాలకంటే సులభంగా క్యాష్‌లెస్‌, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ రోజు (ఆగస్టు 2) ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థ(E-RUPI)ను ప్రవేశపెట్టారు. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్