Sunday, March 8, 2026
HomeTrending Newsకోర్టుల్లో అన్‌లాక్‌ - హైకోర్టు ఉత్తర్వులు

కోర్టుల్లో అన్‌లాక్‌ – హైకోర్టు ఉత్తర్వులు

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, హైకోర్టులో ఈనెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular