Sunday, January 19, 2025
HomeTrending Newsఅస్సాంలో వరదల బీభత్సం

అస్సాంలో వరదల బీభత్సం

Floods Assam : అస్సోం రాష్ట్రంలో కుండపోత వానలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. తాగునీరు, ఆహారం లేక జనం అల్లాడుతున్నారు. మరోవైపు 57 వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇక 1434 పశువులు గల్లంతయ్యాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కారణంగా రాష్ట్రంలో 15 రెవిన్యూ సర్కిల్స్ ప్రాంతాల్లో ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పది వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో పంటలు నీటమునిగాయి.  ముఖ్యంగా కచార్, దీమా హసావ్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ ముగ్గురు మరణించారు. 2 వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. హాఫ్‌లాంగ్ ప్రాంతంలో వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. రెండు రైళ్లు వరదల కారణంగా మధ్యలో చిక్కుకుపోయాయి.

నవగావ్ జిల్లాలోని కామ్పూర్ ప్రాంతాల్లో కోపిలి నది ప్రవాహ ఉదృతికి అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. కోపిలి నది తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైలు సర్వీసుల్ని రూట్ మార్చింది. ఇందులో 14 వందలమంది ప్రయాణీకులున్నారు. ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అస్సాం రైఫిల్స్, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. డిటోక్ చెర్రా రైల్వే స్టేషన్‌లో 1245 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. వీరందరినీ బదర్‌పూర్, సిల్చార్ రైల్వే స్టేషన్లకు తరలించారు. మరో 119 మంది పాసెంజర్లను సిల్చార్‌కు ఎయిర్ లిఫ్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్