Sunday, January 19, 2025
HomeTrending NewsPalwal:హర్యానాలో మహిళపై పోలీసుల అఘాయిత్యం

Palwal:హర్యానాలో మహిళపై పోలీసుల అఘాయిత్యం

దేశ రాజధాని సమీపంలోనే దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఈ నేపథ్యంలో అతడు, మరో వ్యక్తి కూడా ఆ మహిళపై అత్యాచారం చేశారు. హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. జూలై 23న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒక మహిళ హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఎస్‌ఐ శివ చరణ్‌ను ఆమె కలిసింది.

కాగా, ఆ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఎస్‌ఐ శివ చరణ్‌ నిరాకరించాడు. పైగా సహచర పోలీస్‌తో కలిసి సమీపంలోని పొలం వద్దకు వెళ్లాలని ఆమెను బలవంతం చేశాడు. అక్కడ వేచి ఉన్న నిరంజన్, భీమా, ఆ పోలీస్‌ కలిసి ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసి ఆమెను బెదిరించారు. అనంతరం ఆ మహిళను పల్వాల్‌లోని శాంతి అనే మరో మహిళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

మరోవైపు బాధిత మహిళను మూడు రోజులపాటు ఆ ఇంట్లో బంధించారు. ఆ తర్వాత బిజేంద్ర అనే వ్యక్తికి ఆమెను విక్రయించారు. అతడు తన బావ గజేంద్రతో కలిసి ఎస్‌ఐ శివ చరణ్ సమక్షంలో ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే నిందితుల్లో ఒకరి మొబైల్‌ ఫోన్‌ నుంచి ఆ మహిళ రహస్యంగా పోలీసులకు ఫోన్‌ చేసింది. జరిగిన దారుణం గురించి చెప్పింది. తనను కాపాడమని వేడుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి ఆ మహిళను రక్షించారు. ఎస్‌ఐ శివ చరణ్‌తో సహా ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్