అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ను ఖలీస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం ఖండించింది. దౌత్య కేంద్రాలను కానీ, విదేశీ దౌత్యవేత్తలపై అటాక్ చేయడం సరికాదు అని అమెరికా పేర్కొన్నది. విధ్వంసాన్ని, హింసను ఖండిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. కాన్సులేట్‌లో చెలరేగిన అగ్నిని శాన్ ఫ్రాన్సిస్‌కో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆర్పివేసింది. అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు.
కాన్సులేట్ కాలిపోతున్న దృశ్యాలకు చెందిన ఓ వీడియోను దియా టీవీ షేర్ చేసింది. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ నేత హర్దీప్ పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.
భారతీయ కాన్సులేట్‌పై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. వేర్పాటువాదులపై చర్యలను తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.