Saturday, January 18, 2025
HomeTrending NewsKosavo: కొసావో పార్లమెంటులో నేతల ఘర్షణ

Kosavo: కొసావో పార్లమెంటులో నేతల ఘర్షణ

యూరోప్ ఖండంలోని కొసావో దేశ పార్ల‌మెంట్‌లో ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో త‌న్నుకున్నారు. ప్ర‌ధాని అల్బిన్ కుర్తి మాట్లాడుతున్న స‌మ‌యంలో.. చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి మెర్గిమ్ లుస్ట‌కు .. ప్ర‌ధాని వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న చేతుల్లో ఉన్న వాట‌ర్ బాటిల్‌లోని నీళ్లు చ‌ల్లారు. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది. ఒక్కసారిగా పార్లమెంటులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్ర‌ధాని ఆల్బిన్ ప్ర‌సంగం చేస్తుండ‌గా.. స‌డెన్‌గా వ‌చ్చిన మెర్గిమ్ త‌న చేతుల్లో ఉన్న వాట‌ర్ బాటిల్ తీసి ప్ర‌ధానిపై నీళ్లు చ‌ల్లారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న్ను అడ్డుకునేందుకు తోటి నేత‌లు ముందుకు వ‌చ్చారు. రెండు వ‌ర్గాలుగా మారిన నేత‌లు కొట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు విసురుకున్నారు. ప్ర‌ధాని అల్బిన్‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

సెర్బ్ లతో ఘర్షణ అంశం రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఉత్త‌ర కొసావోలో సెర్బ్‌ల‌తో జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ను త‌గ్గించేందుకు ఆ ప్రాంతంలో పోలీసు బ‌ల‌గాల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌ధాని ఆల్బిన్ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ మేయ‌ర్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్