Tuesday, January 21, 2025
HomeTrending Newsపెన్షన్ల దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరుతేది

పెన్షన్ల దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరుతేది

సీఎం కెసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమనిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెలా (ఆగస్టు 31 వ తేదీ) ఖరు లోగా ఈ సేవ లేదా మీ సేవ ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లు, ghmc కమిషనర్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఎం కెసిఆర్ ఆదేశాల ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు తగ్గించిన 57 ఏండ్ల వయోపరిమితి కలిగిన వాళ్లంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపిచ్చారు.

ఆసరా పెన్షన్ల లో భాగంగా 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులైన వారు తక్షణమే ఈసేవ, మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ghmc కమిషనర్లు ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఆగస్టు 31 లోగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాలి. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తు తో పాటు జత చేయాలి. కాగా ఈ దర్ఖస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సేవ కమిషనర్ ను అదేశించారు.

అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ఆసరా పెన్షన్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్లు, పెన్షన్ల మొత్తం వృద్దులకు రూ. 2016/-, దివ్యాంగులకు రూ. 3016/- అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్