Sunday, May 19, 2024
HomeTrending Newsఅర్హులైన దళితులందరికీ దళిత బందు.

అర్హులైన దళితులందరికీ దళిత బందు.

దళిత బంధు కార్యక్రమం ఎల్లుండి సీఎం హుజురాబాద్ లో ప్రారంభిస్తారని, పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ను దళితబంధు కోసం ఎంపిక చేశారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. బీజేపీ నాయకులు కొన్ని సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కన్ఫ్పూజన్ క్రియేట్ చేస్తున్నారని హుజురాబాద్ లో మండిపడ్డారు. హుజురాబాద్ లోని ప్రతి కుటుంబానికి దళితబంధు అందిస్తాం. ఎవరి చెప్పుడు మాటలు వినొద్దన్నారు. రైతు బంధు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినప్పుడు కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసారని మంత్రి గుర్తు చేశారు.

రైతుబంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు,  ఇవాళ  దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అప్పుడు, ఇప్పుడు పథకాలపై అనుమానాలు  సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పైలట్ కింద  దళిత బంధును హుజురాబాద్ లో అమలు చేయడానికి 2వేల కోట్ల కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 2వేల కోట్లతో 20 వేల కుటుంబాలకు దళిత బంధు లబ్ధి చేకూరుతుందని, ఆర్థిక మంత్రిగా నేనే ఈ పథకం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టానన్నారు.

సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ ప్రారంభిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు ఇది అదనమని ఆనాడే చెప్పామన్న మంత్రి హరీష్ రావు అప్పుడు హుజురాబాద్ ఎన్నికలు లేకున్నా మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారన్నారు.

ఏ నాయకుడైనా, ప్రజాప్రతినిధి అయినా తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే సంతోషిస్తారు, ఆహ్వానిస్తారని, ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతారని, దురదృష్టవాశాత్తు ఇక్కడ నిరసలను చేపిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే మరో 10 లక్షలు కేంద్రం నుంచి తెచ్చి ఇవ్వండి. కాకుంటే 20 లక్షలు ఇవ్వండని సవాల్ విసిరారు. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, మాకు చేతనైనంత మట్టుకు పది లక్షలు ఇస్తున్నాం. మరో 40 లక్షలు అదనంగా కేంద్రం‌నుండి తెచ్చిస్తే మీకు, మోడీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారని మంత్రి చెప్పారు.

వచ్చే ఏడాది బడ్జెట్ పెంచుకుని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఎల్లుండి జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కుల అందిస్తామని,

ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. సర్పంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందరికీ దళిత బంధు ఇస్తాం. నియోజకవర్గంలోని ప్రతి అర్హునికీ ఒకే దఫాలో దళిత బంధు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా  దళిత బంధు ఇచ్చి తీరుతామన్నారు.

దళిత బంధులాంటి మంచి పథకాన్ని బీజేపీ తరపున ఇప్పటి వరకు ఆహ్వానించారా? నేనేదో పెద్ద లీడర్ నని చెప్పుకుంటున్న ఇక్కడి నాయకుడు కనీసం కృతజ్ఞత చెప్పాడా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల కమిషన్ కు  దళితబంధు ఆపాలని ఉత్తరాలు రాస్తున్నారని, దళిత బంధు ఆపాలని  హైకోర్టులో కేసులేస్తున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సి కౌశిక్ రెడ్డి, వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తదితరులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్