Tuesday, March 10, 2026
HomeTrending NewsRains: రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Rains: రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుంచి 13 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. 12,13 తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల్లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాధిలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో  కురిసే కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular