Friday, September 20, 2024
HomeTrending NewsDiesel Vehicles: ముక్కుసూటి గడ్కరి...అంతలోనే యు టర్న్?

Diesel Vehicles: ముక్కుసూటి గడ్కరి…అంతలోనే యు టర్న్?

కేంద్ర మంత్రివర్గంలో ముక్కుసూటిగా వ్యవహరించే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కొంత గందర గోళం సృష్టించారు. డీజిల్ వాహ‌నాలు త‌యారీ చేస్తున్న కంపెనీల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వార్నింగ్ ఇచ్చారు. డీజిల్ వాహ‌నాల‌కు త్వ‌ర‌గా గుడ్‌బై చెప్పాల‌ని, లేదంటే ఆ వాహ‌నాల‌పై  ప‌న్ను ప‌ది శాతం పెంచ‌నున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన  ఆటోమొబైల్ తయారీ దారుల అసోసియేషన్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

డీజిల్ వాహ‌నాల వ‌ల్ల కాలుష్యం అధికం అవుతోంద‌ని, అందుకే ప‌ది శాతం అధిక ప‌న్ను వేయాల‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ‌కు ప్ర‌పోజ‌ల్ కూడా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. డీజిల్ వాహ‌నాల సంఖ్య‌ను త‌గ్గించే ఉద్దేశంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు మంత్రి తెలిపారు.

అటు షేర్ మార్కెట్…ఇటు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. టాటా మోటార్స్‌, మ‌హేంద్ర అండ్ మ‌హేంద్ర‌, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు ప‌డిపోయాయి.  ఇది జరిగిన కొన్ని గంటల్లోనే డిజిల్ వాహనాలపై అదనపు పన్నుల ప్రతిపాదన(అదనపు పన్ను) అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి ట్విట్ చేశారు.

 

నిజానికి కేంద్రమంత్రిగా నితిన్ గడ్కరి మొదటి నుంచి పర్యావరణ హితమైన వాహనాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇథనాల్, గ్రీన్ హైడ్రోజెన్ వాడాలని… ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వినియోగం పెరగటానికి గడ్కరి చొరవ ఉంది.

అయితే ఎన్నికల సమయంలో అదనపు పన్ను వ్యవహారం బిజెపికి ప్రతికూలంగా మారుతుందని…పార్టీ సహచరులు చెప్పటంతో నితిన్ గడ్కరి వెనక్కి తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు చమురు మాఫియా గడ్కరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారీ ప్రచారానికి దిగింది.

ఇవి కూడా చదవండి: పుష్ప, జవాన్ కాంబినేషన్ ఫిక్స్

జూనియర్ ఎన్టీఆర్ పై ఆంధ్రా టీడీపీ అధ్యక్షుడి అసహనం

కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే నితిన్ గడ్కరి మాటలు కొన్ని నీటి మూటలు గానే మిగిలిపోయాయి. 60 కిలోమీటర్ల లోపు టోల్ గేట్లు ఉండవు అన్నారు. దేశంలో ఎక్కడా అమలైన దాఖలాలు లేవు.  ఏళ్ల తరబడి వసూళ్ళు చేస్తున్న టోల్ గేట్లపై విధాన నిర్ణయం అన్నారు. ఆ అంశంలో ఏం జరుగుతోందో అమాత్యులకే తెలియాలి.

ఇలాంటి ఒకటి రెండు అంశాలు మినహాయిస్తే నితిన్ గడ్కరి హయంలో రోడ్డు రవాణాలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అనేకమైన సాహసాలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో  అటల్ టన్నెల్ దగ్గరి నుంచి అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ ను బ్రహ్మపుత్ర నదిపై కలిపే భూపేన్ హజారిక వారధి…మహారాష్ట్రలో 5 రోజుల్లో 75 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తి చేయటం ఇలా వివరిస్తూ పోతే గడ్కరి ఘనకార్యాలు చాలానే ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్