Saturday, March 1, 2025
HomeTrending NewsSri Harimandir Sahib: 24 గంటల్లో అమృత్‌సర్‌ లో రెండో పేలుడు

Sri Harimandir Sahib: 24 గంటల్లో అమృత్‌సర్‌ లో రెండో పేలుడు

సిక్కుల యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాగా, 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.

గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్లే మార్గంలోని హెరిటేజ్‌ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, బాంబు స్క్యాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

కాగా, వరుస పెలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. పేలుడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని.. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్