కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరిహారం ఇవ్వాలని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్రాల విపత్తు సహాయ నిధుల నుంచి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని స్పష్టంగా పేర్కొంది. కోవిడ్ కారణంగా భారత్‌లో మొత్తం 4 లక్షలా 45 వేల మందికిపైగా చనిపోయారు.
కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని గౌరవ కుమార్ బన్సాల్ అనే న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మృతుల కుటుంబాల్లో పోషణ బరువై పేదరికంలో మగ్గుతున్నారని, జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ 2005 చట్టం ప్రకారం వారిని ఆదుకోవాలని పిటిషన్ లో కోరారు. సుప్రీమ్ కోర్ట్ లో ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రమాణ పత్రం(అఫిడవిట్ )దాఖలు చేసింది.