Friday, September 20, 2024
HomeTrending NewsVishwakarma: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు

Vishwakarma: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు

మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ డీ ఏ ప్రభుత్వం కొత్త పధకాలకు శ్రీకారం చుట్టింది. ఈ దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఈ-బస్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 57 వేల 613 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం ఈ-బస్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా వంద పట్టణాల్లో ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ-బస్‌ల ద్వారా పట్టణాల్లో రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది.

మరో వైపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన విశ్వకర్మలకు ఆర్థికసాయంపై కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ‎పథకంలో భాగంగా చేతివృత్తుల వారికి రుణాలు అందించనుంది. ఈ పథకానికి 13 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. దేశవ్యాప్తంగా 7 రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 32 వేల 500 కోట్లతో 2 వేల 339 కిలో మీటర్ల మేర ట్రాకింగ్ పనులు చేపట్టనున్నారు. దీని ద్వారా ఏపీ, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్