Wednesday, March 11, 2026
HomeTrending NewsMexico: మెక్సికోలో ఘోర ప్రమాదం...26 మంది మృతి

Mexico: మెక్సికోలో ఘోర ప్రమాదం…26 మంది మృతి

దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికోలోని తమౌలిపాస్‌ రాజధాని సియుడాడ్‌ విక్టోరియా సమీపంలోని హైవేపై ట్రాక్టర్‌ ట్రాలీ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్‌ వ్యాన్‌ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో 26 మంది మృతి చెందారు. ట్రాలీలో మంటలు చెలరేగాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు ట్రాలీని తీసుకెళ్తున్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్‌ పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను ప్రైవేటు సంస్థకు చెందిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని చెప్పారు. వారంతా మెక్సికోకు చెందినవారేనని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular