Sunday, January 19, 2025
HomeసినిమాVeera 'Mullu': వీరమల్లు 'దసరా'కు వస్తుందా?

Veera ‘Mullu’: వీరమల్లు ‘దసరా’కు వస్తుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో మొదలైనా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య రిలీజ్ చేసిన వీరమల్లు టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదరడం లేదు.

మరి.. వీరమల్లు థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే…. ఆమధ్య దసరాకి వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరమల్లు సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పవన్ కళ్యాణ్.. ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ నుంచి సుజిత్ డైరెక్షన్ లో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల షూటింగ్ లో పవర్ స్టార్ జాయిన్ కానున్నారు. దీంతో వీరమల్లు పరిస్థితి ఏంటి..? దసరాకి వచ్చే ఛాన్స్ ఉందా..? అసలు వీరమల్లు వస్తుందా..? వస్తే.. ఎప్పుడు వస్తుంది అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

దసరాకి బాలకృష్ణ మూవీ, రామ్, బోయపాటి మూవీ విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా దసరాకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయినప్పటికీ వీరమల్లు చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట. ఇటీవల పవన్ తో ఈ విషయమై మేకర్స్ చర్చించారని టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరమల్లు చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని డైరెక్టర్ క్రిష్ ఫిక్స్ అయ్యారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి 65 శాతం షూటింగ్ పూర్తయ్యిందట. మరి.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి దసరాకి వీరమల్లుని రిలీజ్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్