21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeTrending NewsKarimnagar: కరీంనగర్ లో ఎన్‌ఐఏ సోదాలు

Karimnagar: కరీంనగర్ లో ఎన్‌ఐఏ సోదాలు

కరీంనగర్ లో ఈ రోజు (గురువారం) తెల్లవారు జాము నుంచి ఎన్.ఐ.ఏ సోదాలు నిర్వహిస్తోంది. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత తబ్రేజ్  ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.

కరీంనగర్ పట్టణంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. ఉదయం నుంచి సుమారు ఐదు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆ ఇంట్లో తబ్రేజ్  లేరని తెలుస్తున్నది. విదేశాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. హుస్సేనీపురతోపాటు కార్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలోని పలు ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్ర‌మంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు స‌మాచారం అందుతోంది.. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్