తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం రాష్ర్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు రూ. 32 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
జులై 1వ తేదీ నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలి. గ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి పవర్ డే పాటించాలి. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.