Sunday, March 8, 2026
HomeTrending Newsచార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

చార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై  రాష్ట్ర హైకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 28 వ తేది వరకు భక్తుల సందర్శనకు అనుమతించరాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్ట్ ఆదేశాలపై సుప్రీమ్ కోర్టులో అప్పీలుకు వెళ్ళిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం న్యాయస్థానం అదేశాలనుసారం మళ్ళీ కొత్త తేదీలు ప్రకటిస్తామని ప్రకటించింది.

 పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. బద్రినాథ్, కేదరనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలను భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపించాలని హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్ లోని చమోలి, ఉత్తరకాశి, రుద్ర ప్రయాగ్ మూడు జిల్లాల ప్రజలకు జూన్ 25 వ తేదీ నుంచి ప్రభుత్వం యాత్రకు అనుమతించింది. జూలై ఒకటి నుంచి మొదటి దశ, జూలై 11 వ తేది నుంచి రెండో దశల చార్ ధాం యాత్రకు దేశంలోని ఇతర ప్రాంతాల భక్తులు రావచ్చని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. యాత్ర రద్దు కావటంతో భక్తులు నిరాశకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular