Sunday, January 19, 2025
Homeసినిమాఅందుకే.. వంశీకి మహేష్‌ నో చెప్పాడా..?

అందుకే.. వంశీకి మహేష్‌ నో చెప్పాడా..?

మహేష్‌ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ సాధించడమే కాదు.. అవార్డులును కూడా తీసుకువచ్చింది. మంచి మెసేజ్ తో తెరకెక్కిన మహర్షి సినిమా మహేష్‌ బాబుకు మంచి గౌరవాన్ని కూడా తీసుకురావడంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

కారణం ఏంటంటే.. వంశీ చెప్పిన స్టోరీ మహేష్‌ కి నచ్చలేదు. దీంతో సున్నితంగా ఈ ప్రాజెక్ట్ ని తిరస్కరించారు. మహేష్‌ వేరే ప్రాజెక్ట్ లో బిజీ అయ్యారు. వంశీ పైడిపల్లి అదే కథను కోలీవుడ్ స్టార్ విజయ్ కు చెప్పడం.. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే.. ‘వారసుడు’. తెలుగు, తమిళ్ లో రూపొందిన వారసుడు చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సైతం ఇది సీరియల్ లా ఉందని.. కథలో ఏమాత్రం కొత్తదనం లేదని.. అందుకనే మహేష్ బాబు ఈ కథకు నో చెప్పారని వార్తలు వచ్చాయి.

వారసుడు ట్రైలర్ విడుదల అయినప్పటి నుండే గతంలో వచ్చిన కొన్ని సినిమాల తరహాలో కథ ఉంది అంటూ పోలుస్తూ ట్రోల్స్ చేయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత కూడా వారసుడును కొందరు తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తమిళనాట భారీ ఎత్తున వసూళ్లు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆనందం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది ప్రచారం చేస్తున్నట్లుగా ఈ సినిమా కథను నేను మహేష్ బాబుకు చెప్పలేదు. మహర్షి తర్వాత మహేష్ బాబుకు కథ చెప్పిన విషయం వాస్తవం.. కానీ అది వారసుడు కాదు అంటూ తేల్చి చెప్పాడు. అయినప్పటికీ వంశీ పై ట్రోలింగ్ ఆగడం లేదు. సినిమా సినిమాకి వంశీకి బాగా గ్యాప్ వస్తుంటుంది. మరి.. ఈసారి ఎవరితో సినిమా చేస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్