Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్ Women’s T20I Tri-Series:  సౌతాఫ్రికాపై ఇండియా విజయం

 Women’s T20I Tri-Series:  సౌతాఫ్రికాపై ఇండియా విజయం

ఇండియా-సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న మహిళల టి 20 ముక్కోణపు సిరీస్  తొలి మ్యాచ్ లో ఆతిథ్య సౌతాఫ్రికాపై ఇండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈస్ట్ లండన్ లోని బఫెలో పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఇండియా ప్లేయర్ అమన్ జోత్ కౌర్ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటింది. హర్మన్ ప్రీత్ ఈ మ్యాచ్ ఆడలేదు, ఆమె స్థానంలో స్మృతి మందానా కెప్టెన్ గా వ్యవహరించింది.

ఓపెనర్ యస్తిక భాటియా మినహా మిగిలిన టాపార్డర్ బ్యాట్స్ విమెన్ విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మందానా(7); హర్లీన్ డియోల్ (8), రోడ్రిగ్యూస్ (0), దేవిక వైద్య(9) త్వరగా ఔటయ్యారు. యస్తిక 35 పరుగులు చేసి ఔటయ్యింది. 69 పరుగులకే ఐదు వికెట్లు పడిన దశలో దీప్తి శర్మ-అమన్ జోత్ కౌర్ లు కలిసి ఆరో వికెట్ కు 76 పరుగులు జోడించారు. దీప్తి 23 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్ తో 33; కౌర్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 41 (నాటౌట్) పరుగులు సాధించారు. నిర్ణీత  20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది.

ఇండియాబౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ తో సౌతాఫ్రికాను కట్టడి చేశారు. కెప్టెన్ సూనే లాస్ 29; చోల్  టైరన్ 26; మరిజాన్నే కాప్ 22 పరుగులు చేశారు. మిగిలినవారు విఫలం కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీప్తి శర్మ 3; దేవిక వైద్య 2; రాజేశ్వరి గైక్వాడ్, స్నెహ్ రానా, రాధా యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

అమన్ జోత్ కౌర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్