Friday, November 22, 2024
HomeTrending NewsG-20: విభేదాలు వీడండి - చైనాకు అగ్రరాజ్యం చురక

G-20: విభేదాలు వీడండి – చైనాకు అగ్రరాజ్యం చురక

భారత దేశంతో ఉన్న విబేధాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే జీ20 స‌మావేశాల్లో త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చైనాను అమెరికా కోరింది. స‌మావేశాల్లో నిర్మాణాత్మ‌క పాత్ర‌ పోషించాల‌ని అగ్రరాజ్యం చైనాకు సూచించింది. ఆ దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జేక్ సుల్లివ‌న్ ఈ అభ్య‌ర్థ‌న చేశారు. ఒక‌వేళ చైనా ఈ స‌మావేశాల‌ను చెడగొట్టాల‌నుకుంటే అది ఆ దేశ ఉద్దేశ‌మ‌ని జేక్ తెలిపారు.

ఢిల్లీలో జ‌రిగే జీ20 స‌మావేశాల‌కు అధ్య‌క్షుడు జిన్‌పింగ్ వెళ్ల‌డం లేద‌ని చైనా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికా ఆ కామెంట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 9, 10వ తేదీల్లో జీ20 స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల‌కు చైనా ప్ర‌ధాని లీ కియాంగ్‌ హాజ‌రుకానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్