Friday, November 22, 2024
HomeTrending Newsకశ్మీరీల సమస్యలపై తాలిబాన్ల గళం  

కశ్మీరీల సమస్యలపై తాలిబాన్ల గళం  

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి తీరుతామని తాలిబాన్ ప్రకటించింది. అందులో భాగంగా కశ్మీర్ ముస్లింల ఇబ్బందులపై గళమెత్తుతామని, అది మా హక్కుగా బావిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షహీన్ కాబూల్లో స్పష్టం చేశారు. భారత్ లోని ముస్లింలతో పాటు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే వారి తరపున మాట్లాడి తీరుతామని బిబిసి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. భారత చట్టాల ప్రకారం ముస్లింలకు ఉన్న హక్కులను పరిరక్షించాలని, అందరితో పాటు ముస్లింలను సమానంగా చూడాలని సోహైల్ అన్నారు. కాబుల్ చేజిక్కించు కాగానే కశ్మీర్ భారత్ అంతర్గత అంశమని, ద్వైపాక్షికంగా చర్చించాలన్న తాలిబన్లు అప్పుడే మాట మార్చారు.

తాలిబాన్ ప్రతినిధి సోహైల్ షహీన్ వ్యాఖ్యలపై  భారాత విదేశాంగ శాఖ స్పందించింది. ఇండియాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించ కూడదు అనే లక్ష్యంతో భారత్ ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి చెప్పారు. తాలిబాన్ల ముఖ్య నేతల్లో ఒకరైన షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానేక్ జాయ్ తో ఖతార్ లో భారత రాయబారి దీపక్ మిట్టల్ దోహలో చర్చలు జరిపారు.  ఆఫ్ఘన్ గడ్డను ఇండియా వ్యతిరేఖ కార్యక్రమాలకు వాడొద్దని తెలుపగా తాలిబాన్ నేత సానుకూలంగా స్పందించారు.

అయితే తాలిబాన్ పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘన్ కేంద్రంగా పనిచేసే అవకాశం ఉందని భారత నిఘా వర్ఘాలు చెపుతున్నాయి. గతంలో ఐసిస్, అల్ ఖైదా మాదిరిగానే కొత్త శక్తులు పుత్తుకొచ్చె ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింల్లోని  సున్ని, వహాబీ శాఖల వారు తాలిబాన్ పాలనను తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు.

పాకిస్తాన్ కు తాలిబాన్ల తో ఉన్న సంభందాల్ని కాశ్మీర్ వేర్పాటువాదులు వాడుకునేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. పాక్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. తాలిబన్లతో సన్నిహితమనే వాస్తవం అమెరికాతో సహా ప్రపంచానికి అంతటికి తెలుసు. అటు   పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (PTI) నాయకుడు నీలం ఇర్షాద్ సంచలన ప్రకటన చేశారు. కాశ్మీర్ విముక్తి కోసం తాలిబాన్ల సహాయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి భారత రక్షణ శాఖ నిఘా పెంచి, అదనపు బలగాల్ని మోహరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్