Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య సినిమాకి 3 అక్షరాల టైటిల్

బాలయ్య సినిమాకి 3 అక్షరాల టైటిల్

నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కెరీర్ లో ఎప్పుడు ఇంత ముందు వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించలేదు. అలాంటిది ఇప్పుడు బాలయ్య వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించడంతో ప్రస్తుతం చేస్తున్న మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది.

ఇది బాలయ్య మార్క్ యాక్షన్ మూడ్ లో ఉంటూనే అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా సెట్ చేశారని సమాచారం. అయితే.. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ‘ఎన్.బి.కె 108’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు కానీ.. టైటిల్ ఏంటి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఎక్కడా లీక్ కాలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి మూడు అక్షరాల టైటిల్ ను పెట్టాలని అనిల్ రావిపూడి ఓ టైటిల్ ఫిక్స్ చేయడం.. బాలయ్య దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఏంటా మూడు అక్షరాల టైటిల్ అనేది ఆసక్తిగా మారింది.

బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారని తెలిసింది. అదే రోజున బాలయ్య కొత్త సినిమా ప్రకటన కూడా రానుంది. ఈ లెక్కన బాలయ్య పుట్టినరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ అన్నమాట. ఇక అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీని దసరాకి విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్