Thursday, May 30, 2024
HomeTrending NewsSecretariat:హెచ్.వో.డీలకు ట్విన్ టవర్లు – సిఎం కేసీఆర్

Secretariat:హెచ్.వో.డీలకు ట్విన్ టవర్లు – సిఎం కేసీఆర్

హైదరాబాద్ లో  సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వో డీ) కార్యాలయాలను వొకే చోటకు చేర్చడం గురించి సిఎం చర్చించారు.

హెచ్ వో డీఅధికారులకు సెక్రటేరియట్ తో తరచుగా పని వుంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గర్లో సమీకృతంగా వొకే చోట నిర్మించేందుకు సిఎం కేసీఆర్ నిర్ణయించారు.

అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ వో డీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు.

సెక్రటేరియట్ కు అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో సిఎం అడిగి తెలుసుకున్నారు.

స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్ వో డీలన్నీ వొకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సిఎం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్