Tuesday, April 16, 2024
HomeTrending Newsఅసెంబ్లీలో ఇక ట్రిపుల్ ఆర్ సినిమానే...

అసెంబ్లీలో ఇక ట్రిపుల్ ఆర్ సినిమానే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హుజూరాబాద్ లో హుజూరాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా?. కేసీఆర్ కు దమ్ముంటే సమాధానమివ్వాలి అంటూ సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరపున డబుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్) లు ఉన్నారని, త్వరలో మరో ఆర్ (రాజేందర్) అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పరు. ఇకపై సీఎంకు అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ఆర్ సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈరోజు (3.10.2021) మధువని గార్డెన్స్ లో బీజేపీ కార్యకర్తలతో ‘హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం’ పేరుతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

టీఆర్ఎస్ పార్టీ కరెన్సీ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసి గెలవాలని చూస్తోంది. హుజూరాబాద్ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. అన్ని విషయాలు వాళ్లకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ బరితెగింపు రాజకీయాలు చేస్తోంది. ఇక్కడి ప్రజలు, బీజేపీ నేతలు బరి గీసి టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నరు. బీజేపీ కార్యకర్తలంతా ప్రతి ఒక్కరూ ప్రతి గడప గడపకూ వెళ్లాలి…ప్రతి ఓటరును కలవాలి. ఓటు అడగాలి. బీజేపీని గెలిపించాలి. టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు రూ.10 వేలిస్తున్నరు. అయినా సరే బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోంది. టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు. తూతూ మంత్రంగా టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతుండు.

బీజేపీ ప్రజాస్వామ్య బద్దంగానే పోటీ చేస్తుంది. కొట్లాడుతుంది. గెలిచి తీరుతుంది. దుబ్బాకలోనూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అట్లాగే కొట్లాడినం. గెలిచినం. హుజూరాబాద్ లోనూ కాషాయ జెండాను ఎగరేస్తాం. బీజేపీ కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి బీజేపీకి ఓటేయాలని కోరారు. హుజూరాబాద్ లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోంది. బీజేపీకి ఓటేయాలని మనసులోనే ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అది తెలిసే కేసీఆర్ వచ్చి బహిరంగ సభ పెట్టి ప్రజలను మాయ చేయాలని చూసిండు.

దళిత బంధును ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు. ఏ షరతు లేకుండా దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్నమని ప్రకటించిండు. ఇప్పడేమో అన్నీ షరతులు పెడుతుండు.  బ్యాంకు అధికారులను హెచ్చరిస్తున్నా….వాళ్లంటే నాకు గౌరవం. కానీ ఈరోజు బ్యాంకు అధికారులు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలతో వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. దళితులు డబ్బులు డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేసే అధికారం బ్యాంకు అధికారులకు ఎక్కడిది? అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం తరువాత  షరతులతో మళ్లీ వాపస్ తీసుకోవడం ఖాయం. ఎన్నికలయ్యాక ఆ పథకాన్ని అటకెక్కిస్తుండు. బ్యాంకు అధికారులకు దళిత బంధు  డబ్బులను ఫ్రీజ్ చేసే అధికారం లేదు. మేం ఫిర్యాదు చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోయవడం ఖాయం. గతంలో కోర్టులు ఈ విషయంలో మెట్టికాయలు కూడా పెట్టింది. మీ తీరు మార్చుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్