Saturday, March 14, 2026
Homeసినిమాఅట్లీ, నయన్ మధ్య విభేదాలా.? ఇది నిజమేనా..?

అట్లీ, నయన్ మధ్య విభేదాలా.? ఇది నిజమేనా..?

షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘జవాన్’. ఇందులో షారుఖ్ ఖాన్ కు జంటగా నయనతార నటించగా, గెస్ట్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటించింది. అయితే.. సినిమా చూసిన జనాలకు దీపికా పడుకునే మెయిన్ లీడ్ గా, నయన్ గెస్ట్ రోల్ లో నటించినట్టుగా అనిపించిందనే కామెంట్లు వచ్చాయి. దీనికి కారణం నయన్ క్యారెక్టర్ ను అట్లీ తగ్గించాడని.. అందుకనే నయన్, అట్లీ పై కోపంగా ఉందని కోలీవుడ్, బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీంతో అట్లీ, నయన్ మధ్య విభేదాలా..? ఇది నిజమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది.

తన పాత్ర నిడివిని తగ్గించడం వలన నయన్ బాగా అప్ సెట్ అయ్యిందని.. అందుకనే జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొనలేదని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇది నిజమేనేమో అని మరింతగా వార్తలు వచ్చాయి. నయన్ ఏ సినిమాకైనా సైన్ చేసేటప్పుడే ప్రమోషన్స్ కు రానని ముందే చెప్పేస్తుంటుంది. ఈ కండీషన్ కు ఓకే అంటేనే సినిమా చేస్తుంది. గతంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి, బాలయ్య శ్రీరామరాజ్యం తదితర చిత్రాల ప్రమోషన్స్ కు కూడా నయన్ రాలేదు. అందుచేత అట్లీ, నయన్ మధ్య విభేదాలు.. తన పాత్ర నిడివి తగ్గించడంతో ఫీల్ అయ్యింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అనుకున్నారు.

అయితే.. గురువారం అట్లీ పుట్టినరోజు. ఉదయం నుంచి సినీ ప్రముకులు అట్లీకి బర్త్ డే విషేష్ తెలియచేశారు కానీ.. నయనతార బర్త్ డే విషేస్ చెప్పకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అని క్లారిటీ వచ్చేసిందని న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అయితే.. గురువారం సాయంత్రం నయనతార ఇన్ స్టాగ్రామ్ లో అట్లీకి బర్త్ డే విషేష్ చెప్పడంతో పాటు జవాన్ మూవీ ఫోటోలు కూడా షేర్ చేయడంతో పుకార్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది. సో.. అట్లీ, నయన్ మధ్య ప్రచారంలో ఉన్నట్టుగా విభేదాలు లేవని చెప్పచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular