Sunday, January 19, 2025
Homeసినిమా లైగ‌ర్ స్టోరీ ఇదే

 లైగ‌ర్ స్టోరీ ఇదే

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్’. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించింది. బాక్సింగ్ లెజెండ్  మైక్ టైసన్ కీల‌క పాత్ర పోషించ‌డంతో ఈమూవీపై ఇటు సౌత్, అటు నార్త్ లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో సినిమా విడుదల కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. లైగ‌ర్ స్టోరీ ఏంటి..?  అమ్మ‌, నాన్న‌, ఓ త‌మిళ అమ్మాయి.. సినిమాలా ఉంటుందా అనే చ‌ర్చ కూడా న‌డుస్తుంది కానీ.. ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక ఉండ‌ద‌ట‌. ఇటీవ‌ల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి లైగ‌ర్ స్టోరీ గురించి స్పందిస్తూ… లైగ‌ర్ స్టోరీ  కరీంనగర్ లో స్టార్ట్ అవుతుంది. కరీంనగర్ కు చెందిన బాలమణి అంటే.. రమ్యకృష్ణ తన కొడుకు విజయ్)ని తీసుకుని ముంబయి చేరుకుంటుంది. అక్కడ తన కొడుకును అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ గా మార్చేందుకు చాలా కష్టపడుతుంది. ఆ క్రమంలో హీరో, అతడి తల్లి ఎదుర్కొన్న పరిణామాలేమిటనేది ఈ సినిమా కథ అని వెల్లడించాడు.

Also Read : మనం మారాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్