కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర – టిపిసిసి

Kcrs Comments : కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు. రాజ్యాంగంపై ఆయన మాటల తరువాత ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్తారు అనుకున్నాం..కానీ ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. సిఎం కెసిఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ గాంధీభవన్ లో పిసిసి అధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ తీరుపై నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే….
చైనాలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు రిటైర్డ్ కావాలి..2 సార్లకు ఎక్కువ అధ్యక్షుడు కాలేరు. 2018 జిన్ పింగ్ రాజ్యాంగాన్ని సవరణ చేసి శాశ్వత అధ్యక్షుడు గా ప్రకటించుకొని రాజరికాపు రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. రష్యా లో 2036 వరకు పుతిన్ అధ్యక్షుడు గా ఉండేలా సవరణ చేసుకున్నాడు. కిమ్ జంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడుగా ఉన్నారు.. అక్కడ ప్రశ్నించేది ఉండదు..వేరే పార్టీ ఉండదు. నరేంద్రమోదీకి పుతిన్, జిన్ పింగ్ ఆదర్శమైతే, కేసీఆర్ కి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆదర్శం.
అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఓటు విలువ ఒకటే. మేమంతా ప్రజా సేవకులం..వాళ్లకి సేవ చేసుకోవడానికి మమ్మల్ని జితగాళ్లుగా పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలుసు గాని కేసీఆర్ ఆయన మిత్రుడు మోదీ కి అర్ధం కావడం లేదు. కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వారు పదవుల కోసం,కుక్క బతుకులుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర నిలబడాల్సిన అవసరం ఉందా..? కేశవరావు నీ విజ్ఞానం ఏమైంది.. నీ ఆలోచనలకు కరోన వచ్చిందా..? కడియం శ్రీహరి నీ ఆలోచనలకు గౌరవం ఉందా…? కేసీఆర్ ఆలోచన విధానాన్ని, కేశవ రావు మాటలు రాజ్యసభ లో మల్లికార్జున ఖర్గే ఖండించారు.
బండి,గుండు కలిసి నిన్న తెలంగాణ భవన్ లో అంబేద్కర్ సాక్షిగా దీక్ష చేశామని చెవుతున్నారు. కేసీఆర్ మీద కేసులు పెట్టాల్సిన మీరు ఎందుకు పెట్టలేదు. రాజ్యసభ, లోకసభలో మీ ఎంపీ లు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఆ రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండు సార్లు తెలంగాణకు సీఎం అయ్యారు. కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉంది. నరేంద్రమోదీ సూత్ర దారి..కేసీఆర్ పాత్ర దారి.
రేపు అన్ని జిల్లాల్లో, పోలీస్ స్టేషన్ లలో కేసీఆర్ ,టీఆరెస్ నాయకుల పై ఫిర్యాదులు చేయాలి. ఎల్లుండి అన్ని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూజలు చేయాలని మహిళా కాంగ్రెస్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. సితక్క ,గితక్క నాయకత్వంలో మేమంతా ట్యాంక్ బండ్ వద్ద పాలాభిషేకం చేస్తాం. సోమవారం పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి దీక్షలో కూర్చుంటాం. సోమవారం పార్లమెంట్ లో కేసీఆర్ పై నిరసన తెలుపుతాం. అమ్మ మీద ఒట్టు ఇంకోసారి రాజ్యాంగం మీద మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా. ప్రగతి భవన్ లో ఇటుక ఇటుక పీకేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *