Sunday, January 19, 2025
Homeసినిమాగీత గోవిందం కాంబో సెట్ అయ్యిందా..?

గీత గోవిందం కాంబో సెట్ అయ్యిందా..?

విజయ్ దేవరకొండ, రష్మిక, పరశురామ్.. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గీత గోవిందం’. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న సినిమాగా రిలీజైన బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించి మేకర్స్ కు భారీగా లాభాలను అందించింది. ఆతర్వాత నుంచి ఈ కాంబోలో మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. విజయ్ దేవరకొండ, రష్మిక, పరశురామ్ బిజీ అవ్వడంతో ఇప్పటి వరకు ఈ కాంబోలో మరో మూవీ సెట్ కాలేదు.

గీత గోవిందం తర్వాత పరశురామ్ నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నారు. ఆ టైమ్ లో మహేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావడంతో నాగచైతన్య సినిమాని పక్కనపెట్టి మహేష్‌ తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేశాడు. ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఈ మూవీ తర్వాత నాగచైతన్యతో సినిమా చేద్దామనుకుంటే.. చైతన్య  వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్ లో భారీ చిత్రం చేస్తున్నాడు. పైగా పరశురామ్ చెప్పిన కథకు నాగచైతన్య మార్పులు చేర్పులు చెప్పాడు. పరశురామ్ రెడీ చేసిన లేటెస్ట్ స్టోరీని ఇంకా చైతన్య వినలేదు.

దీంతో పరశురామ్ బాలయ్య కోసం ఓ కథను, విజయ్, రష్మిక కాంబోలో మూవీ కోసం మరో స్టోరీని రెడీ చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత సరైన కథ కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో మూవీ చేయనున్నాడు అనేది ప్రకటించలేదు. దీంతో విజయ్ తో పరశురామ్ మూవీ కన్ ఫర్మ్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గీత గోవిందం కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్