We are for three: ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన చట్టపరమైన హామీ అని, హోదా సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ అంశం నాటి విభజన చట్టంలో కూడా ఉందని బొత్స గుర్తు చేశారు. సిఎం పలు దఫాలుగా కేంద్రంతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని, హోదా సాధించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. విజయనగరంలో అధికారులతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బొత్స సమీక్ష నిర్వహించారు. అనంతరం హోదా అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెడతామని, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసే విషయంలో ఎలాంటి మార్పూ లేదని బొత్స పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం కూడా చెప్పిందన్నారు. మూడు రాజధానులు అనేది తమ విధాన పరమైన నిర్ణయమని ఈ విషయంలో ముందుకే వెళతామని చెప్పారు.
Also Read : మూడుకే కట్టుబడి ఉన్నాం : పెద్దిరెడ్డి