Friday, April 19, 2024
HomeTrending Newsఐటీలో ఏపీ స్థానం బాధాకరం: జీవీఎల్

ఐటీలో ఏపీ స్థానం బాధాకరం: జీవీఎల్

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం అట్టడుగుస్థాయిలో ఉండడం అత్యంత భాదాకరమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఐటి అంటేనే ఆంధ్రప్రదేశ్ అని, ఎక్కుమంది నిపుణులు మన రాష్ట్రం నుంచే ఉన్నారని, ఇది కనీసం 10 శాతం  వరకూ ఉంటుందని.. కానీ ఐటి ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 0.1 శాతం గా ఉండడం విచారకరమన్నారు. మన నిపుణులు ఐటి రంగాన్ని నిర్దేశిస్తుంటే ఐటి ఎగుమతుల్లో మనం ఇలా ఉండడం శోచనీయమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా బాధ్యతా ఉన్నదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఐటిని అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు గత ఐదేళ్ళలో ఏపీలో ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. అధికారం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో, లేకపోతే చలో హైదరాబాద్ అంటారని… బాబు, జగన్  ఇద్దరిదీ ఇదే తీరని జీవీఎల్ అన్నారు.  విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తాను ఇక్కడే ఉంటానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… గతంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారని… దానికి కట్టుబడి లేరని, కనీసం ఈ మాటమీదైనా నిలబడి ఉంటారని నమ్మకం ఏమిటని అడిగారు.

తాము ఇక్కడినుంచి ఎన్నిక కాకపోయినా రాష్ట్ర సమస్యలపై అధికార పార్టీ ఎంపీల కంటే ఎక్కువగా పార్లమెంట్  సమావేశాల్లో వివిధ అంశాలపై మాట్లాడామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 69 రహదారి ప్రాజెక్టులు ఇప్పటికే చేపట్టామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 1076 కిలో మీటర్ల రహదారుల నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు ఇస్తోందని వెల్లడించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్, రిషికొండపై అక్రమ తవ్వకాలు, విభజన హామీలపై పోరాడామన్నారు.

కేంద్రం  రాష్ట్రానికి అందించిన సహకారంతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించామన్నారు.  రేపు డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే ను నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన లేక ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వెనకబడిందని విమర్శించారు.  ఇప్పుడు వైసీపీ, గతంలో టిడిపి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని తాకట్టు పెట్టాయని, దోచుకోవడానికి వ్యక్తిగత అవసరాలకే అధికారాన్ని వాడుకున్నాయని దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్